ఫ్లెక్సీలు తొలిగించినంత మాత్రాన చేసిన అభివృద్ధిని మర్పించలేరు
నిరంజన్ రెడ్డి మీద కోపంతో దసరా దీపావళి కోసం ఏర్పాటు చేసిన నూతన వాణిజ్య వర్గాల ఫ్లెక్సీలు కూడా తొలగించడం అన్యాయం
కాంగ్రెస్ పార్టీ కక్ష్యపూర్తి చర్యలతో రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తుంది
న్యూస్ తెలుగు / వనపర్తి : నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24గంటలు గడవకముందే తొలగించడం వికృత చర్య అని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మరచి ఇచ్చిన వాగ్దానాలు మరచి పొద్దున లేస్తే నిరంజన్ రెడ్డి నీ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి తప్ప కక్ష్యపురిత చర్యలకు పాల్పడలేదని అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ బి. ఫాం మీద గెలిచి కనీస మర్యాద లేకుండా నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. గతములో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసిన మినిమం వారం రోజులు వాళ్లకు సమయం ఇచ్చామని అన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా అని అన్నారు. డబ్బుల సంచులతో,కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి అదికారధాహముతో పదవులు పొందిన వారికి ప్రజల మనసులో చోటు వుండదని ఇకనైనా కక్ష్య పూర్తి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి జన్మదినం అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించి 125యూనిట్ల రక్తం సేకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వనపర్తిలో రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించేవని కానీ నేటి పాలకులు కక్ష్యపూర్తిగా 24 గంటల్లో నిరంజన్ రెడ్డి గారి అభిమానులు కట్టిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.గతములో మేము కూడా ఛైర్మెన్ పదవి చేశామని ఈవిధంగా చేయడం దురదృష్టకరం అని అన్నారు. వాకిటి.శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తుంది అని మేము ఏనాడు ఇటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. వివేకానంద విగ్రహం దగ్గర మేము ఏర్పాటు చేసుకున్న హార్డింగ్ నందు ఎం.ఎల్.ఏ ఫ్లెక్సీ కట్టినా మేము హుందాగా వున్నామని అన్నారు. ఫ్లెక్సీలు తొలగించడం అనాగరిక చర్య అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం,పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి, ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్,సూర్యవశం.గిరి, జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము, సునీల్ వాల్మీకి,వజ్రాల.రమేష్,తోట.శ్రీను పాల్గొన్నారు.(Story:ఫ్లెక్సీలు తొలిగించినంత మాత్రాన చేసిన అభివృద్ధిని మర్పించలేరు)