సాలూరుకు రైలు సౌకర్యం
న్యూస్ తెలుగు /సాలూరు : విశాఖపట్నం నుంచి సాలూరు పట్టణానికి శుక్రవారం రైలు రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా సాలూరు ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారుల దృష్టికి సాలూరు నుంచి పార్వతీపురం రాయగడ విశాఖపట్నం వరకు రైలు సౌకర్యం కల్పించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ఈ రైలు సౌకర్యం కల్పించలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రైల్వే అధికారులు టైమింగ్స్ ప్రకటించారు శుక్రవారం రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. సాలూరు పట్టణానికి సుమారు ఒంటిగంట సమయంలో ఈ రైలు స్టేషన్ కు చేరుకుంది. సాలూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు రైలు ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. (Story : సాలూరుకు రైలు సౌకర్యం)