పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు /సాలూరు : మొక్కజొన్న లో కత్తిర పురుగు నివారణ కోసం ఇమా మేక్ టీన్ బెంజొఇట్ పురుగు మందులు పిచికారి చేయాలని సాలూరు వ్యవసాయ అధికారి అనురాధ పండా అన్నారు. మంగళవారం సాలూరు మండలం కురుకుట్టి సారిక రైతు సేవా కేంద్రాల పరిదిలో వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో ‘పొలం పిలుస్తుంద’ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మొక్కజొన్న సాగు ఎక్కువ గా ఉన్నందున , మొక్కజొన్న లో కత్తెర పురుగు ఎక్కువుగా పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది అని, కావున రైతులు అందరూ ఇమామెక్టీన్ బెంజోయేట్ మందును ఎకరానికి 100 గ్రా. చొప్పున పిచికారి చేసుకోవాలని రైతులకు ఆమె సూచించారు.
హార్టికల్చర్ ఆఫీసర్ B. ఝాన్సీ అరటి,ఆయిల్ పామ్ & జీడి మామిడి లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే డ్రిప్ & స్ప్రింకలర్లు సబ్సిడీ లో అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు RSK వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.కృషి విజ్ఞాన కేంద్రం నుండి వచ్చిన వెటర్నరీ సైంటిస్ట్ అనూ * మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆవులు , గేదెలు మరియు గొర్రెలు పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు సబ్సిడిలో టార్పలిన్స్ మరియు ట్రాక్టర్ అనుబంధ పరికరాలు సబ్సిడీలో కల్పించమని గ్రామ పెద్దలు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పెద్దలు, ఏ పి సి ఎన్ ఫ్ సిబ్బంది, గ్రామ వ్యవసాయ & ఉద్యాన సహాయుకులు , గ్రామ రైతులు పాల్గొన్నారు. (Story : పొలం పిలుస్తుంది కార్యక్రమం)