ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం అధికారులు నిలబెట్టుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం అధికారులు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం వనపర్తి లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతలు మాట్లాడుతూ నూరీ మజీదుకు కేటాయించిన స్థలాన్ని స్వాదీనపర్చారని కోరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి చిరకాలవాంఛ అయిన రోడ్ల విస్తరణ ప్రజలను ఓపించి మెప్పించి దిగ్విజయంగా పూర్తి చేసారు ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంఅని అన్నారు. రోడ్డు వెంబడి ఉన్న నివాసగృహాలకు నష్టపరిహారంగా డబల్ బెడ్ రూమ్స్ కేటాయించారుఅని అన్నారు. తాత్కాలికంగా కిరాయి ఉన్న కొందరికి సొంత నిధులతో వారికి ఇంటి అద్దె ఇచ్చారుఅని తెలిపారు. రోడ్ల మీద ఉన్న మజీద్,ఆలయాలు,తదితరులకు ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇప్పించారుఅని అన్నారు. అందులో భాగంగానే నూరీ మజీద్ దగ్గర కోల్పోయిన షాప్ లకు ప్రత్యామ్నాయంగా పంచాయత్ కార్యాలయం ఆవరణలో 20×20 స్థలం మున్సిపల్ తీర్మానంతో పాటు అప్పటి కలెక్టర్ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది అని అన్నారు. కాబట్టి వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహేబ్ హుస్సేన్,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్,స్టార్.రహీమ్,సయ్యద్. జమీల్,ఎం.డి.గౌస్,వహీద్,ఆరీఫ్,A.K.పాషా, అలీమ్ తదితరులు పాల్గొన్నారు. (Story : ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం అధికారులు నిలబెట్టుకోవాలి)