బాలింత కష్టంపై స్పందించిన మంత్రి
రూప్‌వే బ్రిడ్జ్ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్
న్యూస్ తెలుగు/సాలూరు : బాలింత కష్టంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సంధ్యారాణి చొరవతో రూప్ వే బ్రిడ్జి మంజూరు అవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రజలు.
బాలింతను ఆస్పత్రికి తీసుకువెళ్ళేందుకు అవస్థలు పడిన కుటుంబ సభ్యులు వివరాల్లోకి వెళ్లగాఅల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం జరిగిన ఘటన
ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ సభ్యులుఈ ఘటన మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవడంతోరాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
స్పందించి వెంటనే స్థానిక ఎమ్మెల్యే ను, సంబంధిత అధికారులతో మాట్లాడివాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి చలించిన ఆమె వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జిని
70 లక్షలతో ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయించినట్లు అధికారులు తెలిపారు.
వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు, గ్రామస్తులు. (Story : బాలింత కష్టంపై స్పందించిన మంత్రి)