Home వార్తలు తెలంగాణ డీఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు రేపటి నుండి  సర్టిఫికెట్ల పరిశీలన 

డీఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు రేపటి నుండి  సర్టిఫికెట్ల పరిశీలన 

0

డీఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు రేపటి నుండి  సర్టిఫికెట్ల పరిశీలన 

జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని

న్యూస్ తెలుగు /ములుగు : 30వ తేదీ రోజు వెలువడిన డీఎస్సీ ఫలితాలలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు, వారు దరఖాస్తు చేసినప్పుడు, నమోదు చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ కు, లేదా మెయిల్ అడ్రస్ కి మెసేజ్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని వస్తుందని,అలాంటివారు ఒకటవ తేదీ అక్టోబర్ మంగళవారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంబంధిత పూర్తి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం విభాగం వారీగా వెరిఫికేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయబడతాయని, కావున అభ్యర్థులు విధిగా సంబంధిత పూర్తి సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు సకాలంలో హాజరై వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని వారు తెలిపారు.(Story : డీఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు రేపటి నుండి  సర్టిఫికెట్ల పరిశీలన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version