వెల్ది రాంబాబు సేవలు ఎన్నటికీ మరువలేనివి
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్
న్యూస్ తెలుగు/చాట్రాయి : పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు వెల్ది రాంబాబు చేసిన సేవలు ఎన్నటికీ మరు లేనివని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కొనియాడారు. ఇవాళ మరణించిన చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు వెల్దు రాంబాబు జ్ఞాపకార్థం ఆయన కొడుకు వెల్దివేను నూతనంగా తయారు చేయించిన వాటర్ ట్యాంకును చింతమనేని చేతుల మీదుగా ప్రారంభించారు వెల్దు రాంబాబు చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు అనంతరం చింతమనేని మాట్లాడుతూ. మార్లపాలెం లో గ్రామ టీడీపీ ని బలోపేతానికి కృషి చేసిన రాంబాబు ఆకస్మిక మరణం చాలా బాధాకరం అన్నారు. పిఎసిఎస్ అధ్యక్షుడిగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముల్లంగి చిట్టిబాబు ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డి టిడిపి మండల మాజీ అధ్యక్షులు మరిడి చిట్టిబాబు, మర్లపాలెం ఉపసర్పంచ్ వెళ్ది రాజారావు, మర్లపాలెం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు వెల్దీ అప్పారావు, టిడిపి నాయకులు నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.(Story:వెల్ది రాంబాబు సేవలు ఎన్నటికీ మరువలేనివి)