సాధన దీక్షను విజయవంతం చేయండి
సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
న్యూస్ తెలుగు /కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన శాసన సభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్బాబు.మాట్లాడుతూ తేదీ:30-09-2024ఉ”11 గం` నుండి మంగళవారం ఉ” 11 గం` వరకు 24 గంటల పాటు రైతు హామీల సాధన కోసం నిరసన దీక్షను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోచేపట్టనున్నామనిఈ వేదికను రైతాంగం ఉపయోగించుకోవాలని, రైతు రుణమాఫీ, ప్రభుత్వ వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా అమలుకు నోచుకోకపోవడం, పంట నష్టపరిహారం చెల్లించకపోవడం తదితర సమస్యలు ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడతామని రైతన్నలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.(Story:సాధన దీక్షను విజయవంతం చేయండి )