UA-35385725-1 UA-35385725-1

గుండె జబ్బులు గురించి ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలి..

గుండె జబ్బులు గురించి ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలి..

స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గుండె జబ్బులు గూర్చి ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ హార్ట్ డే (ప్రపంచ గుండె దినోత్సవం) సందర్భంగా పలు విషయాలను వారు ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలతో పాటు ముందుగానే అవగాహన చేసుకోవడం వలన, ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం గుండె ఆరోగ్యం మీద ప్రధానంగా ఆధారపడి ఉందని తెలిపారు. శరీరంలోని ప్రతి అవయానికి రక్తం సరఫరా జరిగేది గుండె స్పందన పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. కావున మానవుని శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవంగా గుర్తించాలని తెలిపారు. గుండెలో రకరకాల జబ్బులు రావచ్చునని ఇందులో గుండె రక్త ప్రసరణ వ్యవస్థకు, రక్త నాళాలకు వచ్చే జబ్బులు, గుండె స్పందన పట్ల వచ్చే రోగాలు, పుట్టుకతో గుండె పెరుగుదల లోని లోపాల వల్ల వచ్చే గుండె జబ్బులు, గుండె కవాటాలకు వచ్చే జబ్బులు, గుండె కండరాలకు వచ్చే జబ్బులు ఉంటాయని తెలిపారు. శరీరంలో కొవ్వు శాతం పెరగడం వలన రక్తనాళాలు కూడుకుపోయి గుండెపోటు రావడం, మెదడులో రక్తనాళాలు కూడుకుపోయి పక్షపాతముగాని మరణము గాని సంభవించడం జరుగుతుందని తెలిపారు. పొగ తాగడం నేరుగా గాని, పరోక్షంగా కానీ పీల్చడం వలన రక్తనాళాలు ఊపిరితిత్తులు దెబ్బతిని చిన్న వయస్సులోనే గుండెపోటు రావడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా యువకులు, పిల్లలు సైతం గుండెపోటుతో మృతి చెందుచుండడం ఆందోళనను కలగజేస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి దుర అలవాట్లకు దూరంగా ఉండటమే హ్రూద్రోగ సమస్యలకు పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారని తెలిపారు. రక్షణ బాధ్యత మీ చేతుల్లోనే ఉందని విచ్చలవిడిగా ఆహారపు అలవాట్లతో గుండె సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. అందుకే ఎవరి గుండె రక్షణ బాధ్యత వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇటీవల హృద్రోగ బాధితులు పెరిగిపోయారని, పొగ తాగడం, అధిక బరువు ఉండడం, తీవ్ర ఒత్తిడికి లోను కావడం, నిద్రలేమి, జంక్ ఫుడ్ తీసుకోవడం, నూనె పదార్థాలు అధికంగా వినియోగించడం వంటి ఆహారపు అలవాట్లు గుండెకు హాని కలిగిస్తున్నాయని తెలిపారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. గుండెకు తగిన జాగ్రత్తలు పాటించడమే వీటికి విరుగుడు అని తెలిపారు. శరీర గురువును అదుపులో ఉంచుకొని రోజుకు ఒక అరగంట పాటు నడక గాని వ్యాయామం గాని తప్పనిసరిగా చేయాలని, కనీసం రోజుకు ఆరు గంటలు లేదా ఎనిమిది గంటలు నిద్రపోవాలని తెలిపారు. ప్రధానంగా ఉప్పు చక్కెర తక్కువగా తీసుకోవాలని తెలిపారు. చాలామంది ఛాతిలో నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్లనే అది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. గుండెపోటు ఒక్కసారిగా రాదని దాని లక్షణాలు నెలరోజులు ముందుగానే కనిపిస్తాయి అని తెలిపారు. అంటే బాగా చెమట పట్టడం, త్వరగా అలసిపోవడం, చాతిలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు తెలిపారు. మనం తినే ఆహారం జీవన విధానములో మార్పు తప్పక తెచ్చుకోవాలని, తప్పనిసరిగా దూరాలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. సాధ్యమైనంతవరకు కొవ్వు సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, అనవసర విషయాలపై ఆలోచించి ఆందోళనకు గురి కాకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని తెలిపారు. గుండె సమస్యలతో యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని ఇది ఆందోళన కలిగించే విషయమని చాలామందికి తమకు ప్రమాదం ఉందని తెలుసుకోలేకపోతున్నారని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని తెలిపారు. కావున ప్రజలందరూ కూడా గుండె పట్ల తగిన అవగాహన కల్పించుకొని, డాక్టర్ యొక్క సూచనలను పాటిస్తూ, వైద్య చికిత్సలను అందుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని వారు తెలిపారు.(Story:గుండె జబ్బులు గురించి ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలి..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1