పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అప్పగింత
న్యూస్ తెలుగు/సిద్దిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్)తో పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో సిద్దిపేట జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. – సిద్దిపేటకు చెందిన ఎండీ.షోహెల్, ఎండీ.షకీల్ నెవెల్ కుమార్, ప్రసాద్ గౌడ్, రహీమ్ ఇటీవల వేర్వేరుచోట్ల తమ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈమేరకు స్థానిక సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఎవరికి వారు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటింటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అప్లికేషన్ ఉపయోగించి పోయిన ఐదుగురి సెల్‌ఫోన్లను వెతికి పట్టుకున్నారు. ఈక్రమంలో వన్ టౌన్ ఎస్‌ఐ నరసింహారావు బాధితులను సోమవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఫోన్లను స్వయంగా అందజేశారు. (Story : పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అప్పగింత)