అభివృద్ధిపై మంత్రి సత్య కుమార్ సమీక్ష సమావేశం
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని వారు ఆదేశించారు. అనంతరం మున్సిపల్ శాఖ అధికారులతో అభివృద్ధిపై ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించడం తదునుగుణంగా చర్యలు తీసుకోవడం ప్రధానంగా చర్చకు రావడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం సక్రమమైన ప్రణాళికలు రూపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పనం కాకుండా పోలీసులు సంబంధిత విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా పట్టణ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని ఇది అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. పట్టణ ప్రజల జీవిత శైలిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వము కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. అనంతరం 250 మంది పారిశుద్ధ్య కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు. తదుపరి సాయంత్రం పట్టణంలోని పీటీ కాలనీలో మన ఇల్లు మన గౌరవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ వాడు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్డీఏ కార్యాల ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు.(Story:అభివృద్ధిపై మంత్రి సత్య కుమార్ సమీక్ష సమావేశం.)