ఇది మంచి ప్రభుత్వం ఫ్లెక్సీలో కుల వివక్షతా..?
ఏలూరు ఎంపీ గారి ఫోటో ఏది..?
ఆ ఫ్లెక్సీ వేయించింది ఎవరు..?
న్యూస్ తెలుగు /చాట్రాయి : దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా… పాలకులు మారినా… ప్రభుత్వాలు మారినా…. కుల వివక్షత మాత్రం కొనసాగుతూనే ఉంది. అగ్రకుల అహంకారంతో చోటామోటా గాళ్లు విర్రవీగుతూనే ఉన్నారు అనడానికి అద్దం పట్టింది మర్లపాలెంలో ఇది మంచి ప్రభుత్వం ఫ్లెక్సీ. తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం సభను నిర్వహించింది. సభా వేదిక పైన ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. దానిపైన వేసిన ఫోటోలలో బీసీ సామాజిక తరగతికి చెందిన ఏలూరు ఎంపీ ఫోటోనే వేయలేదు. ఎస్సీ సామాజిక తరగతికి చెందిన గ్రామానికి ప్రదమ పౌరుడైన గ్రామపంచాయతీ సర్పంచ్ ముల్లంగి చిట్టిబాబు ఫోటోకి ప్రాధాన్యతను తగ్గించారు. అదే సందర్భంలో మాజీ ఎంపీ మాగంటి బాబు ఫోటో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫోటో వేసారు. మండల తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన సంబంధంలేని చీపురుగూడెం గ్రామానికి చెందిన బొట్టు లక్ష్మణరావు ఫోటోలు కూడా వేశారు. ఇటీవల కాలంలో చాట్రాయి మండలంలో కేవలం బొట్టు లక్ష్మణరావు వ్యవహార శైలి వల్లనే పార్థసారథి పై తీవ్రమైన విమర్శలు ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో మర్లపాలెం గ్రామస్థాయిలో జరుగుతున్న సభలో ఫ్లెక్సీ పై ఆయన ఫోటో వేయాల్సిన అవసరం ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. మర్లపాలెం లో సర్పంచ్ ఫోటోను చిన్నగా వేసి ఉపసర్పంచ్ ఫోటో పెద్దగా పెద్దగా వేయాల్సిన అవసరం ఏమిటని సర్పంచి ఎస్సీ కావడం వలన దానికి ప్రాధాన్యత తగ్గించారనే దానికి అద్దం పడుతుందని పలువురు అంటున్నారు. ఎంపీ గారి ఫోటో ఏదని కొందరు ప్రశ్నించడంతో . సభాధ్యక్ష్య స్థానంలో ఉన్న ఎన్నారై బొట్టు వంశీ మాట్లాడుతూ . ఫ్లెక్సీ డిజైనింగ్ లో పొరపాటు జరిగిందని సంజాయిషీ ఇచ్చారు. మర్లపాలెం సర్పంచ్ ముల్లంగి చిట్టిబాబును న్యూస్ తెలుగు ప్రశ్నించగా ఆ ఫ్లేక్సీ ఎవరు వేయించారో తనకు తెలియదని నా ఫోటో కూడా నేను ఇవ్వలేదు అన్నారు. సర్పంచ్ అయిన తన ఫోటోను అలా వేయడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఉపసర్పంచ్ వెల్ది రాజారావు మాట్లాడుతూ. ఫ్లెక్సీ వేయించింది మేము కాదన్నారు. ఇది ఇలా ఉండగా మర్లపాలెం గ్రామస్థాయిలో జరిగే సభకు వేరే వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకు రావడం ఏంటీ…. ? అదికూడా వాళ్ళకు నచ్చిన విధంగా వేయించుకోవడం బీసీ సామాజిక తరగతికి చెందిన , ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ మెంబర్ని కూడా నిర్లక్ష్యం చేసి మాజీ ఎంపీలు ఫోటో లకు ఇతర చోట్ల ఎమ్మెల్యేలకు పార్టీలో ఏ విధమైన ప్రాధాన్యత లేని వారికి ఫ్లెక్సీలో ప్రాధాన్యత రావడం తరాలు మారిన దేశానికి స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచిన జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ఎస్సీలు బీసీలు, ఎస్టీలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కుల వివక్షతను ఎదుర్కొంటేనే ఉన్నారని చోటా మోటా గాళ్ళు రాజ్యం ఏలుతున్నారని అనడానికి ఇది మంచి ప్రభుత్వం సభా వేదిక ఫ్లెక్సీ నే అద్దం పడుతుందని పలువురు అంటున్నారు. (Story : ఇది మంచి ప్రభుత్వం ఫ్లెక్సీలో కుల వివక్షతా..?)