UA-35385725-1 UA-35385725-1

విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్

విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్

దివ్యాంగ లక్షణాల గుర్తింపుకు ప్రత్యేక యాప్

న్యూస్ తెలుగు/ సిద్ధిపేట జిల్లా ప్రతినిధి( నారదాసు ఈశ్వర్)/ అక్కన్నపేట : పిల్లలకు దివ్యాంగ లక్షణాలు బాల్యంలోనే కనిపించినా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతగా శ్రద్ధ వహించకపోవడంతో వయస్సు పెరుగుతున్న కొద్ది అధికమవుతోంది. ఇందుకు నివారణగా వీరిని ఉపాధ్యాయులు ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే మెరుగైన జీవనం గడపగలరని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి సంకల్పించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా మూడంచెల నిర్ధారణ కార్యక్రమాలకు నిర్ణయించింది. ఈమేరకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో మండల విద్యాధికారి గుగులోతు రంగా నాయక్ నేతృత్వంలో ప్రశస్త్ యాప్ నిర్వహణ తీరుపై శనివారం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యాప్ ప్రత్యేకత గురించి న్యూస్ తెలుగు మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనం…


విద్యార్థులు సచేతనంగా ఉన్న సమయంలో ఉపాధ్యాయుల సమక్షంలోనే ఎక్కు వగా ఉంటారు. ఈ క్రమంలో వారిని పాద శాలలో సునిశితంగా గమనించే వీలుంటుంది వారిలో దివ్యాంగ లక్షణాలు ఉంటే గుర్తించడానికి ప్రశస్థ్ యాప్ ని రూపొందించింది. ప్రధానోపాధ్యాయుడి మెయిల్ చిరునామా ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 21 రకాల వైకల్యాలను గుర్తించిన విద్యాశాఖ తొలుత విద్యార్థులను ఉపాధ్యాయుడు కనీసం రెండు వారాల పాటు గమనించి విద్యార్ధి వివరాలను నమోదు చేయాలి. రెండో దశలో శిక్షణ పొందిన నిపుణులు గమనించినట్లు నమోడు, మూడో దశలో ఆ లక్షణాలున్న విద్యార్థి తల్లి,లేదా తండ్రిని విడిగా పిలిపించి గుర్తించిన రుగ్మతలను వివరించి, అనుమతిస్తే పరీక్షకు పంపిస్తారు. చిన్నప్పుడే చికిత్స అందించక పోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని కౌన్సిలింగ్, నిపుణులతో కూడా మాట్లాడిస్తారు. వారి అనుమతితో విద్యార్దిని ఉన్నత స్థాయి పరీక్షలకు పంపించి, ధ్రువపత్రం అందజేస్తారు. అక్కడి నుంచి సదరు విద్యార్థి ప్రత్యేక ప్రతిభావంతుడిగా గుర్తింపబడతాడు. మొదట తనకు దివ్యాంగ లక్షణాలు పరీక్ష చేస్తున్నామనే భావన కలగకుండా రిసోర్సు పర్సన్లు జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి దశ నివేదికలు అక్టోబర్ 26వ తేదీ వరకు యాప్ లో నమోదు చేయాలని సూచించారు. (Story : విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1