గొట్లూరు గ్రామంలో స్వచ్ఛత హీ సేవలో పర్యావరణ, పరిరక్షణ, నిర్వహణ ర్యాలీ
న్యూస్ తెలుగు /ధర్మవరం( శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హి సేవా ప్రచార కార్యక్రమం- ఐదవ రోజు భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ మరియు నిర్వహణ -ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం గొట్లూరు గ్రామ సచివాలయం పరిసరాలలో వున్న చేత్తా చేదారం, ముల్లకంపలను తొలగించే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా గొట్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పి.గణేష్ రెడ్డి , సచివాలయసిబ్బంది పాల్గోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సందేశాన్నిచ్చి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం ప్రిన్సిపాల్,డా.కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా లో భాగం గా గ్రామములో సేవచేసే అవకాశం లభించిందని ప్రతీఒక్కరు పర్యావరణ ని పరిరక్షించాలని, ” స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత” నినాదంతో సెప్టెంబర్ 17-అక్టోబర్ 2 వరకు భారత ప్రభుత్వం కార్యక్రమాలు తలపెట్టడం జరిగిందనీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డా. ఎస్. షమీవుల్లా, డాక్టర్ బి. గోపాల్ నాయక్, బి. ఆనంద్, వై. తాహిర్ అలీ ..తదితర అధ్యాపక, అధ్యాప కేతర బృందం, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story : గొట్లూరు గ్రామంలో స్వచ్ఛత హీ సేవలో పర్యావరణ, పరిరక్షణ, నిర్వహణ ర్యాలీ )