మైనారిటీస్ యువతకు ఉద్యోగావకాశాలు
న్యూస్‌తెలుగు/ నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, అర్హులైన మైనారిటీల ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీకులు కొరకు వివిధ రంగాలలో ఐటి, ఎడ్యుకేషన్, హెల్త్, అకౌంటింగ్, కన్స్ట్రక్షన్, వెటర్నరీ& డైరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యుటీషియన్, హర్టీకల్చర్, టూరిజం & హాస్పిటాలిటీ, డ్రైవింగ్, ఎలక్ట్రానిక్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వృత్తి శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన కొరకు వృత్తి శిక్షణ సంస్థలను ట్రైనింగ్ పార్ట్ నర్ లుగా నియమించుటకు గాను గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వృత్తి శిక్షణ సంస్థల నుండి దరఖాస్తులను తీసుకుంటున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమశాఖ అధికారి టి.విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ వృత్తి శిక్షణ సంస్థలు జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ యన్ ఎస్ డి సి/ టాస్క్ ఈజి యమ్ యమ్/ మెప్మా తో గుర్తింపు / అనుసంధానము అయి ఉండవలెను మరియు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ తో గుర్తింపు పొంది ఉండవలెను.అర్హత మరియు ఆసక్తి కలిగిన వృత్తి శిక్షణ సంస్థలు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆఫీసు లో గల జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ, కార్యాలయములో అక్టోబర్ 05 తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు మొబైల్ నెం: 9494345471,79811 96060 ను సంప్రదించాలని కోరారు. (Story : మైనారిటీస్ యువతకు ఉద్యోగావకాశాలు)