విద్యావ్యవస్థ బలోపేతానికి సర్కారు కృషి
మండల విద్యాధికారి గుగులోతు రంగానాయక్
న్యూస్ తెలుగు/అక్కన్నపేట్/సిద్ధిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): విద్యావ్యవస్థ
బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఈవో గుగులోతు రంగా నాయక్ పేర్కొన్నారు.విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ స్థాయి పెంచేందుకు సిద్ధిపేట జిల్లాలో 26 మండలాలకు ఎంఈవోలను (మండల విద్యాధికారులు) నియమిస్తూ మంగళ వారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో మండలాల వారీగా సీనియర్, గెజిటెడ్ హెచ్ఎం లకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కేటాయించారు.ఈమేరకు అక్కన్నపేట ఎంఈవోగా గూగులోతు రంగా భాద్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తానాని అన్నారు.మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నాణ్యతతో పాటు, వేగవంతంగా జరిగేలా, చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని మరియు విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని వారికి అందేలా ప్రభుత్వం చేపడుతున్న మెనూ ప్రకారం సక్రమంగా అందేలా చూస్తానని ఆయన ఈ సంధర్భంగా తెలియజేశారు.విద్యావ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రభుత్వం చేపట్టే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచేలా తన వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఎక్కడ ఎటువంటి డ్రాప్ అవుట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులను సిబ్బందిని కలుపుకుంటూ విద్యాభివృద్ధికి పాటుపడతారని తెలిపారు(story:విద్యావ్యవస్థ బలోపేతానికి సర్కారు కృషి)