అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ లక్ష్యంగా శిక్షణ ఉండాలి
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్‌తెలుగు/ విజయవాడ కార్పొరేషన్ : అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చే విధంగా విద్యార్థులకు శిక్షణ కల్పించాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ చాంబర్‌లో కమిషనర్ గురువారం వీఎంసీ స్పోర్ట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని స్పోర్ట్స్ స్టేడియంలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో విద్యార్థులకు, ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాదించేలా శిక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే తక్షణం మరమతులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ సిబ్బంది నుంచి వచ్చిన విన్నపాలపై తక్షణం స్పందించి త్వరిత గతిన మరమ్మతులు పూర్తిచేసి వారికి అప్పగించాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఈఈలు రామమోహన్, శ్రీరామచంద్రమూర్తి, జిమ్, స్విమ్మింగ్ కోచ్‌లు, స్టేడియం ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
వార్డులోనిని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి`కమిషనర్ ధ్యానచంద్ర
నగరంలో ఉన్న వార్డ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పెషల్ ఆఫీసర్లును ఆదేశించారు. వీఎంసీ నూతన భవనంలో నగర పరిధిలోని స్పెషల్ ఆఫీసర్లుతో కమిషనర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 64 వార్డులకు 64 స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయగా, స్పెషల్ ఆఫీసర్‌కి కేటాయించిన ప్రతి సచివాలయంలోని సమస్యలను వారే సమీక్షించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆ వార్డులో ఉన్న ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, నిరంతరం వారి చర్యలను కమిషనర్ సమీక్షిస్తారని తెలిపారు. ప్రతి వార్డులో ఉన్న ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా స్పెషల్ ఆఫీసర్ దృష్టిలో ఉండాలని, ఆ సమస్యను సంబంధిత శాఖాధిపతులతో మాట్లాడి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కమిషనర్ సహకారం అన్నివేళలా ఉంటుందని తెలిపారు.