చారిత్రాత్మక ప్రదేశాల్లో స్వచ్ఛత హి సేవ
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్‌తెలుగు/ విజయవాడ కార్పొరేషన్ : నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మిక ప్రదేశాలో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనదని స్వచ్ఛత హి సేవ నిజమైన అర్థం అని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అన్నారు. నగరంలోని గాంధీ కొండపై గురువారం నిర్వహించిన శ్రమదానంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛత కార్యక్రమంలో గాంధీకొండ, మొగల్రాజ్ పురంలోని కొండ గృహల్లో శ్రమదానం ద్వారా వ్యర్థాలను తొలిగించి పరిశుభ్రపర్చినట్లు తెలిపారు. ప్రతిరోజు వీఎంసీ వినూత్నంగా నిర్వహించే స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని, స్వచ్ఛ విజయవాడ కేవలం ప్రజల భాగ్యస్వామ్యంతోనే సాధ్యపడుతుందన్నారు. 300 అడుగుల జాతీయ జెండాను పట్టుకొని గాంధీ కొండ కింద నుండి పై వరకు నిర్వహించిన ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌పై 400 మంది విద్యార్థులు ప్రజలు పాల్గొని సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, రెడ్యూస్డ్ రీ యూస్ రీసైకిల్, స్వచ్ఛభారత్ నినాదాలతో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత హి సేవలో భాగంగా గాంధీ కొండ, మొగలరాజపురం గుహలను పరిశుభ్ర పర్చటంతో పాటు బుర్రకథ బృందంతో వారికి అర్థమయ్యే రీతిలో స్వచ్ఛతను వివరించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు, సర్కిల్`1 కార్యాలయం సిబ్బంది, కమిషనర్ ధ్యానచంద్ర గాంధీ కొండలో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు, గడ్డి, కలుప మొక్కల్ని స్వయంగా తొలిగించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేవీ.సత్యవతి, సీఎంవోహెచ్ డాక్టర్ పీ.రత్నావళి, జోనల్ కమిషనర్లు రమ్యకీర్తన, ప్రభుదాస్, ఎఎంహెచ్‌వోలు డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ బాబుశ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, సర్కిల్`1 సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. (Story : చారిత్రాత్మక ప్రదేశాల్లో స్వచ్ఛత హి సేవ)