హృద్రోగంకు గురైన వారికి సి.పి.ఆర్.తో పునర్జన్మను అందించవచ్చు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల-మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. లో సుశిక్షులను చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ ఫ్రంట్ లైను వారియర్ గా సమాజానికి ఇంకామెరుగైన సేవలందించేందుకు పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. నిర్వహించుటలో సుశిక్షులను చేసేందుకు తిరుమల-మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏదైనా రహదారి ప్రమాదం లేదా మరేదో సంఘటన జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే ఫ్రంట్ లైను వారియర్ గా సంఘటనా స్థలానికి ముందుగా చేరేది పోలీసులేనన్నారు. సంఘటనా స్థలంలో గాయాలతో అపస్మారక స్థితిలో పడివున్న వారికి అవసరాన్నిబట్టి గోల్డెన్ హవర్స్ లో సి.పి.ఆర్. చేస్తే, వారికి పునర్జన్మ అందించిన వారమవుతామన్నారు. అయితే, సి.పి.ఆర్. ఎప్పుడు, ఎలా, ఎంతసేపు నిర్వహించాలన్న విషయాలపై తప్పనిసరిగా పూర్తి అవగాహన ఉండాలన్నారు. వైద్యులు సూచించిన పద్ధతిలో సి.పి.ఆర్. నిర్వహిస్తే, సత్ఫలితాలిస్తుందన్నారు. అవసరమైన సందర్భాల్లో సి.పి.ఆర్. నిర్వహించే విధానం పట్ల పోలీసు సిబ్బందిని సుశిక్షులను చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శిక్షణ పొందిన పోలీసులు తమ స్టేషనులో ఉన్న మిగిలిన పోలీసు సిబ్బందికి శిక్షణ అందిస్తే ఇంకా మెరుగగైన ఫలితాలు వస్తాయన్నారు.తిరుమల-మెడికవర్ ఆసుపత్రి ఎం.డి. డా॥ కే. తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ – దొమ్మీలు, త్రొక్కిసలాటలు జరిగినపుడు మనల్ని మనం రక్షించుకొంటూ, ఇతరులను రక్షించేందుకు పోలీసు సిబ్బందికి తప్పనిసరిగా సి.పి.ఆర్. చేసే విధానం పట్ల అవగాహన ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ కృషితో సిబ్బంది అందరికి సి.పి.ఆర్. శిక్షణ ఇచ్చి, వారితో ప్రాక్టికల్గా సి.పి. ఆర్.చేయిస్తామన్నారు.
తిరుమల-మెడికవర్ ఆసుపత్రి కార్డియాక్ వైద్యులు డా. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ – ఏ పరిస్థితుల్లో సి.పి.ఆర్. అందించాలన్న విషయం పట్ల అవగాహన అవసరమన్నారు. గుండె నుండి రక్త ప్రసరణ ఆగిపోయినపుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని, కార్డియక్ అరెస్టును గుర్తించి, సకాలంలో స్పందించి సి.పి.ఆర్. చేస్తే, తిరిగి గుండె పని చేస్తుందని, తద్వారా మనిషిప్రాణాలనునిలపవచ్చునన్నారు.తిరుమల-మెడికవర్ వైద్యులు సి.పి.ఆర్. చేసే విధానం పట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషను ప్రదర్శించి, అవగాహన కల్పించి, సి.పి.ఆర్. ఏ పరిస్థితుల్లో చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చెయ్యాలన్న విషయాల పట్ల పూర్తి అవగాహన కల్పించి, శిక్షణకు హాజరైన ప్రతీ ఒక్క పోలీసు సిబ్బందితో ప్రాక్టికల్ చేయించి, సి.పి.ఆర్. చేయడం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డా. జి.రామారావు, డా. షరీన్ హసన్ భట్, డా. రామలక్ష్మి, ఎస్బీ సిఐ ఎవి లీలారావు, ఆర్ఎస్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, ఆసుపత్రి టెక్నీషియన్స్ కే.వి. సాయి కుమార్, జి.దుర్గారావు, ఆర్.ఎస్.ఐ.లు, సివిల్ మరియు ఆర్మ్ డ్ రిజర్వు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.(Story:హృద్రోగంకు గురైన వారికి సి.పి.ఆర్.తో పునర్జన్మను అందించవచ్చు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్)