బదిలీపై వెళ్తున్న విద్యుత్ అధికారులకు ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/వినుకొండ : నరసరావుపేట, వినుకొండ నుండి. బదిలీపై వెళ్తున్న విద్యుత్ అధికారులను గురువారం నాడు విద్యుత్ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. నరసరావుపేటలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న. ఎస్ శ్రీనివాసరావు, సిఆర్డిఏ. అమరావతికి, వినుకొండలో విద్యుత్ ఏడీఈగా పనిచేస్తున్న పి కిరణ్ బాబు గుడివాడ రూరల్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా పై ఇరువురు అధికారులను. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 జిల్లా అధ్యక్షులు జిసిహెచ్ కొండలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా కొండలు మాట్లాడుతూ అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులకు పూర్తి సహకారం అందించారని కొనియాడారు. అలాగే పై అధికారులు కూడా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు మునయ్య, నిత్యానందం, రవికుమార్, బాలు, కోటి, రమేష్, సురేష్, లక్ష్మయ్య, వెంకటేష్, నాయక్, తదితరులు పాల్గొన్నారు. (Story : బదిలీపై వెళ్తున్న విద్యుత్ అధికారులకు ఘన సన్మానం)