UA-35385725-1 UA-35385725-1

18 రోజుల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సుదీర్ఘ సమ్మె ఫలితమే..!

18 రోజుల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సుదీర్ఘ సమ్మె ఫలితమే..!

నేడు కాంట్రాక్ట్ కార్మికులకు 5000…!

కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు శనగల శ్రీనివాస్..!

న్యూస్‌తెలుగు/ విశాఖ‌ప‌ట్నం : సింగరేణిలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా అన్ని విభాగాలలో పని చేస్తూ సింగరేణి లాభాల బాటలో నడవడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని 2022 సెప్టెంబర్ 9నుండి 26 వరకు. సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన సుదీర్ఘ ఐక్య సమ్మె ఫలితమే.నేడు లాభాల వాటా నుండి 5000 రూపాయలు కాంట్రాక్టు కార్మికులకు ప్రకటించారనే వాస్తవాన్ని గుర్తించాలని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ ) రామగుండం ఆర్జీవన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోట వెంకన్న.లు అన్నారు. ఉదయం వివిధ జోన్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారుమాట్లాడుతూ 2022 సెప్టెంబర్ 18 రోజుల ఐక్య సమ్మె పోరాటం కార్మికులకు 5000 ప్రకటించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా 22 జీవోను వెంటనే అమలు చేయాలని.సింగరేణి పర్మినెంట్ కార్మికులకు లాభాల వాటలో 33% అగ్రిమెంటు అయితే వారితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీసం మూడు శాతం అయినా అగ్రిమెంటు కావాల్సి ఉండేనని ఏదైనా పర్సంటేజ్ లో అగ్రిమెంట్ అయితే కాంట్రాక్టు కార్మికులకు భవిష్యత్ హక్కు ఉండేదని అన్నారు ఐదు వేలు సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు ఓబి కార్మికులు, సివిక్ మెయింటినెన్స్,హాస్పిటలు, వెహికల్ డ్రైవర్స్,సెక్యూరిటీ గార్డ్స్. సులబ్ కార్మికులు, హౌస్ కీపింగ్ రైల్వే డిపార్ట్మెంట్ ట్రాక్ మైంటెనెన్స్, లోడింగ్ అన్లోడింగ్, నర్సరీ పార్క్ కార్మికులు, అండర్ గ్రౌండ్ సర్ఫేస్ ఆల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు. కచ్చితంగా 5000 అందించే బాధ్యత సింగరేణి యాజమాన్యానిదే అని అన్నారు. లేనిచో ఉద్యమాలు చేయవలసి వస్తుందని అన్నారు 5000 రూపాయలు అమలు చేసే దాంట్లో కూడా విభజించి పాలించే అటువంటి ధోరణి సింగరేణి,
యాజమాన్యం విడనాడి అన్ని కేటగిరి ఆల్ విభాగాలకాంటాక్ట్ కార్మికులకు నేరుగా కాంట్రాక్ట్ కార్మికుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ కోసం మరో పోరాటం చేపట్టడానికి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో కొమురక్క, ఐలక్క చందర్ రెడ్డి లక్ష్మీ,రమ, వరలక్ష్మి, సూరి, స్వరూప, విజయ, సారయ్య, సాయిలమ్మ, సంధ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు (Story : 18 రోజుల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సుదీర్ఘ సమ్మె ఫలితమే..!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1