Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జగన్ తిరుపతిని అపవిత్రం చేశాడు

జగన్ తిరుపతిని అపవిత్రం చేశాడు

0

జగన్ తిరుపతిని అపవిత్రం చేశాడు

ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటు వ్యాఖ్య‌లు

న్యూస్‌తెలుగు/వినుకొండ : జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతిని అపవిత్రం చేసి నేడు జగన్ దొంగల ముఠా ఆలయాలు సందర్శిస్తాం అని చెప్పటం సిగ్గు చేటనే ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటుగా విమర్శించారు. బుధవారం రాత్రి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో చేసిన పాపాలన్నీ మర్చిపోయి నేడు గుడులు గోపురాలు దర్శిస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో దోచుకున్న సొమ్మంతా హుండీలో వేసిన ఆయన పాపం పోదని జివి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతిలో అన్ని వ్యవస్థలను హేళన చేస్తూ పాలన చేసిన జగన్ రెడ్డికి తిరుపతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఆనాడు టీటీడీ పాలకవర్గంలో అంతా వైసిపి దొంగలేనని, లడ్డు వ్యవహారంలో బయటపడ్డ నిజాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ అధికారులను నియమించడం మంచి పరిణామం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కసారైనా ఆయన సతీమణితో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించారా అని జీవి ప్రశ్నించారు.,.. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దూసుకుపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు. పెన్షన్ పంపిణీ అలాగే విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే జీవీ సొంతగా 50 లక్షలు రూపాయలు ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వినుకొండ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు రెండు కోట్లు, షాది ఖానా నిర్మాణానికి మూడు కోట్లు, నియోజకవర్గంలో సిసి రోడ్లు పలు అభివృద్ధి పనులకు 10 కోట్లు, నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా మక్కెన గుర్తు చేశారు.. కాగా గత వైసిపి పాలనలో వినుకొండ ప్రజలు పన్ను రూపంలో మున్సిపాలిటీకి కట్టిన పన్ను నిధులు, అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరు కోట్ల నిధులను. తన సొంత భూములకు ధరలు వచ్చే విధంగా గిరి ప్రదర్శన రోడ్డు అంటూ దానికి ఖర్చు చేయటం జరిగిందని ఈ విషయం బుధవారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాస్తగిరి బహిరంగంగా ప్రకటించటం విశేషమని మక్కెన అన్నారు. వైసీపీలో మున్సిపల్ నిధులు ఇలా దుర్వినియోగం జరిగిందని మక్కెన అన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే త్రాగు నీటి పథకానికి 159 కోట్లు నిధులు మంజూరయ్యావని. వైసిపి ప్రభుత్వం హయాంలో వినుకొండకు నిధులు ఏమాత్రం రాలేదని మక్కెన అన్నారు. అలాగే తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో వినుకొండ పంచాయతీ స్థాయి నుండి మున్సిపాలిటీగా అప్ గ్రేట్ చేయడం జరిగిందని, అప్పుడు పట్టణంలో పలు మున్సిపల్ కాంప్లెక్స్ లు నిర్మించి అతి తక్కువ అద్దెకు బలహీన వర్గాలకు అద్దెకు ఇవ్వటం జరిగిందన్నారు… కాగా నేడు పట్టణంలో కొళాయిలు లేని పేద ప్రజానీకానికి మునిసిపల్ నీరు సరఫరా చేసే విధంగా ఒక్కొక్క కొళాయికి 200 రూపాయలు చొప్పున మున్సిపాలిటీకి జీవి కి చెందిన శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చెల్లిస్తుందని, ఇది పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కొళాయి కనెక్షన్లు పొందాలని మక్కెన కోరారు. ఈ సమావేశంలో నాయకులు. పివి సురేష్ బాబు, ఎం మురళి, పి.పూర్ణ పాల్గొన్నారు. (Story : జగన్ తిరుపతిని అపవిత్రం చేశాడు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version