Home వార్తలు తెలంగాణ వనపర్తి జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్

వనపర్తి జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్

0

వనపర్తి జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో ఓ కానిస్టేబుల్ రామకృష్ణ పిసి నంబర్ 2234 మిస్సింగ్ కలకలం రేపింది. పానగల్ పీఎస్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ.. గత రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. పానగల్ పిఎస్ నుండి ఎస్కార్ట్ పిసి గా చివరిసారిగా విధులను నిర్వహించాడు. ఆ తర్వాత రామకృష్ణ జాడ లేకుండా పోవడంతో.. అతని భార్య మంజు ఫిర్యాదు చేసింది. ఆర్ధిక ఇబ్బందులతో విధులకు చేయలేకపోతున్నానని ఒక మెసేజ్ తన భార్య మంజులకు పెట్టి ఇంటి నుండి వెళ్లిపోయినాడు. రామకృష్ణ ఎక్కడికి వెళ్లాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతుండడంతో.. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంజుల ఫిర్యాదు పై FIR మ్యాన్ మిస్సింగ్ నమోదు చేసి రామకృష్ణ ఆచూకీ కొరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు అని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీరామదాసు తేజావత్ గారు తెలిపారు. (Story : వనపర్తి జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version