భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినచాకలి ఐలమ్మ
తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
చాకలి ఐలమ్మ విగ్రహంను ఆవిష్కరించిన మంత్రి
న్యూస్ తెలుగు /ములుగు : ఏటూరు నాగారం మండల కేంద్రములోని వై జంక్షన్ లో రజక సంఘం ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దన సరి అనసూయ సీతక్క హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లను గడగడ లాడిరచిన, ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాపోరాటాలను కొనసాగించాలనీ మంత్రి సీతక్క అన్నారు. నిజాం ప్రభువు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు, దొరలు, జాగిరిదార్లు, పేదలు, బడుగుబలహీనవర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను ఘోసపెట్టారని ఈ పరిస్థితులలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను, దౌర్జన్యాలను ఎదురించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు కోఠి లోని మహిళా విశ్వవిద్యాలయానికి వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగిందని, అదే విధంగా చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించడం జరిగిందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో మా ప్రజా పాలన కొనసాగిస్తామని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో యం ఎల్ సి బస్వరాజు సారయ్య తో పాటు ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ, రజక సంఘం రాష్ట్ర, జిల్లా,మండల నాయకులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినచాకలి ఐలమ్మ)