పెబ్బేరు మార్కెట్ యార్డుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తా
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మార్కెట్ యార్డుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మండల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పెబ్బేరు మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి తన శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 కే సిలిండర్, రూ. 18000 కోట్లతో వ్యవసాయ రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. పంట పండించే రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెబ్బేరు సంత ఆసియా లోనే అతిపెద్దది అని, దీనికి ఉన్న 30.20 ఎకరాల స్థలాన్ని ఎవరూ కబ్జా చేయకుండా ఫెన్సింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి స్వరన్ సింగ్ నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ గా గౌని ప్రమోధిని w/o గౌని పాండేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గా
A. విజయవర్ధన్ రెడ్డి S/o A. గోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులుగా
ఎరపగ ఆంజనేయులు S/o ఎరపగ ఎర్ర యెల్లయ్య,
బత్తుల కవిత W/o బత్తుల కోటేశ్వర్ రెడ్డి,
ఎరసాని రామన్ గౌడ్ S/o ఎరాసాని నారాయణ,
సయ్యద్ షాహీన్ బేగంW/o సయ్యద్ హుస్సేన్ పీర్,
పెద్దింటి రామకోటి S/o పెద్దింటి సంజన్న,
B. కృష్ణయ్య S/o B. బుచ్చన్న, ఈ. నరసింహా నాయుడు తండ్రి శాంతన్న,
మధుగాని శంకర్ S/o మధుగాని సవరయ్య,
కాట్రావత్ వెంకటేష్ నాయక్ S/o కాట్రావత్ రామచంద్రయ్య,
మోతే రాముడు S/o మోతే బాలస్వామి, ఆర్. చంద్రకళ W/o R. ప్రహ్లాద్,
ఏటుకూరి బుచ్చయ్య S/o ఏటుకూరి శేషయ్య శెట్టి,
చైర్మన్ పీఏసీఎస్, శ్రీరంగాపురం జగన్నాథ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ శాఖ అధికారి స్వరన్ సింగ్, వనపర్తి మార్కెట్ యార్డు చైర్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, పాలక వర్గ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. (Story : పెబ్బేరు మార్కెట్ యార్డుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తా)