జాతీయ సేవా సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
విద్యార్థుల శ్రమదానం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని, స్వచ్ఛత హీసేవ పక్షోత్సవాలలో భాగంగా “స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ డైరెక్టర్ బి భాస్కర్ రెడ్డి,కళాశాల ఆవరణం నందు చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు ప్రక్రియను విద్యార్థులతో కలిసి చేపట్టారు.కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అలాగే ప్రకృతి ని కాపాడవలసిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ పిఓ హర్షవర్ధన్,ఏ ఓ. రమేష్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. (Story : జాతీయ సేవా సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు)