హైదరాబాద్‌లో గ్రేటీహెచ్‌ఆర్ కస్టమర్ మీట్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: పూర్తిస్థాయి హెచ్‌ఆర్‌ఎంఎస్ ప్లాట్‌ఫారమ్ ప్రదాత అయిన గ్రేటీహెచ్‌ఆర్, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తమ కస్టమర్ మీట్‌ను నిర్వహించింది. ‘గ్రేటీ2గెదర్’ పేరిట ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20వ తేదీన హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రేటీహెచ్‌ఆర్ కస్టమర్ అవసరాలు, అంచనాలపై లోతైన అవగాహనను పొందడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం లో 115 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కంపెనీ గురించి సమగ్ర అవగాహన కల్పించటంతో పాటుగా దాని కస్టమర్‌లకు బ్రాండ్ గ్రేటీహెచ్‌ఆర్ అంటే ఏమిటో ప్రెజెంటేషన్‌తో ప్రారంభించబడిరది. జననీ ప్రకాష్, హెడ్ – పీపుల్ అండ్ కల్చర్, జెన్జియన్, ‘బిల్డింగ్ టుడే ఫర్ లీడిరగ్ టుమారో’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. గ్రేటీహెచ్‌ఆర్ బృందం కొత్త ఫీచర్ విడుదలను ప్రదర్శించింది. ఇవి తమ కస్టమర్‌లకు ఎలా విలువను జోడిస్తాయో చూపారు. ఈ ప్రెజెంటేషన్‌ను అనుసరించి ప్రత్యేక కస్టమర్ ఫీడ్‌బ్యాక్ సెషన్ జరిగింది. (Story: హైదరాబాద్‌లో గ్రేటీహెచ్‌ఆర్ కస్టమర్ మీట్)