విద్యార్థులకు స్వచ్ఛత హి సేవపై అవగాహనకు పోటీలు
నగరపాలక సంస్థ సీఎంఓహెచ్ డాక్టర్ పీ.రత్నావళి
న్యూస్ తెలుగు/విజయవాడ : విద్యార్థులకు స్వచ్ఛత హి సేవపై అవగాహన పొంపొందించేందుకు వారికి వివిధ పోటీలు నిర్వహిస్తోన్నట్లు నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ.రత్నావళి తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా భవానిపురం సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పటమట పంట కాలువ రోడ్డుకలోని నారాయణ అప్పర్ ప్రైమరీ హై స్కూల్‌లో, పటమట ఎనర్ ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్‌లో మంగళవారం విద్యార్ధులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంజ్‌సర్కిల్‌లో ఆంధ్రా లయోలా కాలేజీ విద్యార్థులతో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ సిబ్బంది. స్వచతా హి సేవ కార్యక్రమంలో భాగంగా 43 డివిజన్ భవానీపురం సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సర్కిల్`3 పరిధిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్, పంట కాలవ రోడ్డు వద్ద నారాయణ స్కూల్‌లో విద్యార్ధులకు సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్, రెడ్యూస్ రీయూజ్ రిసైకిల్, వాయు కాలుష్యంపైన వాస్య రచన పోటీలు, ప్లాస్టిక్ మానేజ్మెంట్‌పైన వకృత్వ పోటీలు, పోస్టర్స్ స్లొగన్స్ ప్రెసెంటేషన్ నిర్వహించి గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ, కనసొలేషన్ బహుమతులు అందజేశారు. నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి.రత్నావళి ఆంధ్రా లయోలా కాలేజ్ విద్యార్థుల భాగస్వామ్యంతో బెంజ్‌సర్కిల్ వద్ద శ్రమదానం చేయటంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణానికి ర్యాలీ నిర్వహించి తద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి.రత్నవలీ, శానిటరీ సూపర్వైజర్ ఓబేస్వరరావు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. (Story : విద్యార్థులకు స్వచ్ఛత హి సేవపై అవగాహనకు పోటీలు)