Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తాళం వేసిన ఇంట్లో దొంగతనం

తాళం వేసిన ఇంట్లో దొంగతనం

0

ఇంటికి తాళం వేసిన ఇంట్లో దొంగతనం 

నాలుగున్నర తులాల బంగారం, రూ.3,50,000 నగదు అపహరణ

వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని ఎల్సికేపురంలో శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు ఓ ఇంట్లో దూరి నాలుగున్నర తులాల బంగారము, మూడు లక్షల 50 వేల రూపాయలు నగదును దోచుకుని వెళ్లారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్సికేపురంలో నివాసముంటున్న బాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం పులివెందులలో ని భైరవ స్వామి ఆలయానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసిన విషయాన్ని దుండగులు అర్ధరాత్రి గమనించడంతో, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని ఇంటి తాళాలను పగలగొట్టి, బీరువాను పగలగొట్టి, నాలుగున్నర తులాలు బంగారమును, మూడు లక్షల 50 వేల రూపాయల నగదును, బాత్రూం లో అమర్చిన ఇన్వర్టర్ ని కూడా దోచుకుని వెళ్లారు. ఆదివారం చుట్టుపక్కల వాళ్ళు తాళం పగలగొట్టిన విషయాన్ని గమనించి ఇంటి యజమాని బాబుకు ఫోన్ చేసి తెలిపారు. హుటా హుటిన పులివెందుల నుంచి ఆదివారం ధర్మవరం కు చేరుకొని ఇంటిలో జరిగిన తీరును పరిశీలించి, సమాచారాన్ని టూ టౌన్ సిఐ రెడ్డప్పకు తెలిపారు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలను సేకరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎల్ సి కె పురం వన్ టౌన్ ఏరియా కూ చెందినందున వన్టౌన్ సిఐకు అప్పగించడం జరిగిందని టూటౌన్ సిఐ తెలిపారు. (Story : ఇంటికి తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసిన చోరులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version