Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలి

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలి

0

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ సోమవారం నిర్వహించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 81 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 23, కుటుంబ కలహాలకు సంబంధించి 7 ఫిర్యాదులు, మోసాలకు పాల్పడినట్లుగా 17 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించినవి 34 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐ ఎ.లీలారావు, డి సి ఆర్ బి ఎస్ఐ ఆర్. వాసుదేవ్, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version