గ్రామాలను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం
న్యూస్ తెలుగు /సాలూరు : గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు వాడుకుని గ్రామాలను నిర్వీర్యం చేశారని. రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు . సోమవారం పాచిపెంట మండలం పంచాలి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు . ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ అధ్యక్షతన జరిగింది. మొదట గ్రామంలో 38 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమెకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం. సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కె సాధ్యమని అన్నారు . గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించి గ్రామాల అభివృద్ధిని కుంటిపడేలా చేశారని అన్నారు. పెన్షన్లు పెంపు. నిరుద్యోగులకు డీఎస్సీ ప్రకటించడం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం. పేదవాడికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో చేయడం జరుగుతుందని అన్నారు. సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. విజయవాడ వరద బాధితుల కోసం పాంచాలి హై స్కూల్ విద్యార్థులు 7000 రూ మంత్రి ఆమెకు అందించారు. విద్యార్దులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న. పంచాలి ఎంపీటీసీ కే సురేష్ పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖి సూర్యనారాయణ, కోరిపిల్లి సురేష్ , కనకరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామాలను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం)