UA-35385725-1 UA-35385725-1

ఈనెల 26న జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ వద్ద భారీ ధర్నా

ఈనెల 26న జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ వద్ద భారీ ధర్నా

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈనెల 26న నాగులూరు వద్ద గల జెఆర్సిల్స్ ఫ్యాక్టరీ వద్ద భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక నాయకులు వెంకటనారాయణ, పెద్దన్న, వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా చేనేత సంఘాల ప్రముఖులు రావడం జరుగుతుందని,అక్కడి అవినీతి అక్రమాలపై నిగ్గు తెలుస్తాం అని తెలిపారు. చేనేతల పొట్ట కొట్టి పైశాచిక ఆనందంలో సిల్క్స్ యజమాని మోసాన్ని బయట పెట్టి తీరుతామని తెలిపారు. యాజమాన్యం అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చడానికి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మిక సంఘాలు ఏకమయ్యాయి అన్నారు. స్థానికులకు పనులు కల్పించకుండా బిహారీ లచే పనులు చేయించుకోవడంతో పాటు జెట్ మగ్గాలు వేసి స్థాయి మగ్గాల యాజమాన్యాలకు కూడా కంటగింపుగా మారడం జరిగిందన్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జె ఆర్ సిల్క్స్ యజమాని జింక రామాంజనేయులు పై అమితుమీ తెలుసుకోవడానికి సన్నద్ధమం కావడం జరిగిందన్నారు.దాదాపు 200 జెట్ స్పీడ్ మగ్గాలు వేసి చేనేత పరిశ్రమను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని ఏకచత్రాధిపత్యం వహించాలన్న దుర్బుద్ధితో చేనేత వ్యవస్థని బ్రష్టు పట్టించడానికి ఏకమవుతున్నారన్న ఆందోళనతో ప్రజా సంఘాలు ముందుకు వస్తున్నాయి అని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 26న బత్తలపల్లి మండలం వేల్పుమడుగు ప్రధాన రహదారిపై ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున సబ్సిడీ పొంది 100 కోట్లతో నిర్మించిన ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేయడానికి ఈనెల 26న అందుకు వేదికగా నిర్ణయించడం జరిగిందన్నారు.
స్థానికులు ఎవరైనా ఆ ఫ్యాక్టరీ గోడను దాటుకుని అవతలికి వెళితే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారన్న విమర్శలు కార్మిక సంఘాలు తెలిపారు. అంతేకాకుండా దాదాపు అధునాతన జెట్ స్పీడ్ తో కలిగిన మగ్గాలు ఏర్పాటు చేసి రోజుకు ఒక్క మగ్గంలా ద్వారా నాలుగైదు చీరలు తయారు చేసే సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తులు బాగా పెరిగి, ఇతరుల మగ్గాల ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు తెలిపారు. ఒకే మగ్గం ద్వారా నాలుగైదు చీరలు తయారు చేయడం ద్వారా మార్కెట్ ధర కంటే రూ 50 రూపాయలు తక్కువ ధరకు ఇచ్చిన జెఆర్ సిల్క్స్ యాజమాన్యానికి లాభాలు ఉండే అవకాశం ఉందన్నారు.. మగ్గాలు ఇతరులు వేయడానికి వీలుండదు అని, అందుకు ప్రధాన కారణం జే ఆర్ సిల్క్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకొని సబ్సిడీపై తక్కువ ధరకే యంత్రాలను కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు స్థాయిలో చీరలు ఉత్పత్తులు పెరగడం వల్ల ధర తగ్గించినా కూడా అధిక లాభాలు అర్థించడానికి వీలవుతుందని చేనేత మేధావులు పేర్కొంటున్నారు అని మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో అడ్డుకట్ట వేయకపోతే చేనేత పరిశ్రమ అంతా ఒకరి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, వాటిని నమ్ముకున్న ఇతర చేనేతలకు గిట్టుబాటు ధర కలగకపోవడం వల్ల వృత్తిని వదిలేసే పరిస్థితి ధర్మవరంలో నెలకొంటోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమకే ఉనికికే తలమానికంగా మారిన జేఆర్ సిల్క్స్ ను అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీయడానికి చేనేత సంఘాలన్నీ ఏకమై కార్మికులకు బాసటగా నిలవడానికి సన్నద్ధమవుతున్నారు అని తెలిపారు.చేనేత పరిశ్రమ ఒకరిద్దరి చేతుల్లోకి పూర్తిగా తరలిపోతున్నడంవల్ల అందులో నమ్ముకున్న ఇతర కార్మికులకు ఆ వృత్తి ద్వారా నిలదొక్కుకోలేని పరిస్థితి ఎదురవుతోందని స్థానిక చేనేత కార్మిక సంఘం నాయకులు గగోలు పెడుతున్నాయి అని తెలిపారు. స్థానిక చేనేత కార్మిక సంఘాల నాయకులు ముసుగు మధు వెంకటనారాయణ జంగాలపల్లి పెద్దన్న ఈ సందర్భంగా చేనేత వ్యవస్థపై అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకు ఎండగడుతూ వస్తున్న, అక్కడి యాజమాన్యాలు అధికారుల లాలూచీ వల్ల ఏమి చేయలేని పరిస్థితిలో తల డిల్లిపోతున్నారు అని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పవర్ లూమ్స్ పైన పోరాటం చేస్తున్న విచ్చలవిడిగా పవర్లూమ్స్ ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ధర్మారం అంటే చేనేత పరిశ్రమకు దేశ విదేశాల్లో సైతం గుర్తింపు ఉందని వాటిని మరిచిపోయే పరిస్థితి నేడు ఏర్పడడం బాధాకరం అంటూ సంఘాలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ఇటువంటి తరుణంలో పరిశ్రమను పడడం కోసం కొందరి వ్యవహార శైలి నిరసిస్తూ ఈనెల 26న జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకే వ్యక్తి 200 రూమ్స్ జెట్ మగ్గాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులపై పడుతుందన్నారు. కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి జెఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ పైన యుద్ధభేరి మ్రోగించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్, జోలి శాఖ అధికారులు జె ఆర్ సిల్క్ యాజమాన్యం ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి వ్యవస్థనే నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేసేలా, జిల్లా మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవితమ్మలు కృషి చేయాలని వారి డిమాండ్ చేశారు.

కరపత్రాలు విడుదల…. జే ఆర్ ప్రైవేట్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎదురుగా ధర్నాపై సోమవారం సిపిఐ, సిపిఎం అనుబంధ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. జే ఆర్ సిల్క్స్ యాజమాని జింక రామాంజనేయులు అవినీతి అక్రమాలపై ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి, వెంకటస్వామి రమణ, ఆదినారాయణ ,శ్రీధర్ చట్టా గంగాధర్, శ్రీనివాసులు, బాల రంగయ్య, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఈనెల 26న జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ వద్ద భారీ ధర్నా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1