Home వార్తలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పొన్నంపై విమర్శలు

అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పొన్నంపై విమర్శలు

0

అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పొన్నంపై విమర్శలు

న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్):
హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే,మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయనపై, అధికారపార్టీపై బీజేపీ, భారాస తప్పుడు విమర్శలు చేస్తున్నాయని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్కన్నపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముత్యాల సంజీవరెడ్డి మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ప్రతిపక్షాల విమర్శలు, అసత్యాలు, అబద్ధాలను తిప్పికొట్టాలని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై, మంత్రి పొన్నాంపై నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల సీఎం రేవంత్ రెడ్డికి,మంత్రి పొన్నం ప్రభాకర్ కి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అభివృద్ధి విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి, కట్కూరు సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, పార్టీ శ్రేణులు బంధారం శ్రీనివాస్, పత్తిపాక త్రిమూర్తి, చొక్కం గణేష్,గుగులోతు రాజు నాయక్,మ్యాక రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు బంధారం రాజయ్య, వల్లపు పర్శరాములు, కరోంటోతు రవి, మోహన్ నాయక్,ఎండీ ఫారిద్,కొమ్ముక రాజయ్య, గంగారపు అనిల్, తదితరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పొన్నంపై విమర్శలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version