Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దిగ్విజయంగా ముగిసిన ఆర్య వర్క్ పై వారం రోజుల శిక్షణా కార్యక్రమం

దిగ్విజయంగా ముగిసిన ఆర్య వర్క్ పై వారం రోజుల శిక్షణా కార్యక్రమం

0

దిగ్విజయంగా ముగిసిన ఆర్య వర్క్ పై వారం రోజుల శిక్షణా కార్యక్రమం

న్యూస్‌తెలుగు/ తిరుప‌తి :శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ఉమాదేవి ఆధ్వర్యంలో వారం రోజుల ఆర్య వర్క్ పైన శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుండి ప్రారంభమై 23వ తేదీ వరకు ఎస్వీ నగర్ పెరిమాళ్ళపల్లి గ్రామ మహిళలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ఉమాదేవి మాట్లాడుతూ ఈ శిక్షణా కాలంలో మహిళలు ఎంతో ఆసక్తిగా ఆర్య వర్క్ నేర్చుకున్నారని ప్రస్తుతం బాగా మార్కెటింగ్ ఉన్న ఈ స్కిల్ కి రకరకాల డిజైన్లు చీరలకు, బ్లౌజులకు దుస్తులకు ఎలా వేయాలో నేర్చుకోవడం వల్ల తమకు నచ్చిన విధంగా తమ తమ దుస్తులకు వేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా వేసి వారు స్వయం ఉపాధి సాధించగలరని తద్వారా మరికొందరికి ఉపాధి అందిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం. పద్మ మహిళలకు ఆర్య వర్క్ పైన శిక్షణ ఇచ్చారు, మహిళలకు ఆర్య వర్క్ పైన గల సందేహాలను నివృత్తి చేసి తగిన సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు డాక్టర్ డి.ఉమాదేవి సర్టిఫికెట్లతో పాటు, వారు ఇంకా సాధన చేయడానికి ఉపయోగపడే ప్రేమలు సూదులు కూడా అందించారు.మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్ట్ అసిస్టెంట్ డాక్టర్ ఎం. ఇంద్రాణి సహాయ సహకారాలు అందించారు.ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version