UA-35385725-1 UA-35385725-1

బలపరుద్దాం..బీఆర్ఎస్ ని కాపాడుకుందాం

బలపరుద్దాం..బీఆర్ఎస్ ని కాపాడుకుందాం

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : బలపరుద్దాం….బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాంఅని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుల,ప్రజాప్రతినిధుల ఆత్మీయసమ్మేళనం ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వారి స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముఖ్యనాయకులకు పలుసూచనలు చేస్తూ నాయకులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యదక్షత,అనుభవం లేని ప్రభుత్వం నేడు పరిపాలనలో ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని 60లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే 40లక్షల మంది మాత్రమే రైతులు రుణాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించి రైతు రుణమాఫీకి క్యాబినెట్లో 27లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి కేవలం 17లక్షల కోట్లు మంజూరు చేసింది అని దుయ్యబట్టారు. రైతు బంధు,కౌలు రైతులకు రైతు బంధు యాసంగి,వానాకాలం పంట కాలం ముగుస్తున్న నేటికీ ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచారు అని అన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తొలమ్ బంగారం,కె.సి.ఆర్ కిట్టు,అమ్మ ఓడి, మహిళలకు 2500,నిరుద్యోగభృతి,వంటి ముఖ్యమైన హామీలకు మంగళం పాడింది అని ఇట్టి విషయాలను ప్రజలోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను వివరించాలని అన్నారు. ఆశ్రిత పక్షపాతం పాటిస్తూ అనుయాయులకు పెద్ద పీట వేస్తున్నారని 9నెలల కాలములో ఒక్క కొత్త జి.ఓ ఇవ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి మన హయాములో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసిందని ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. నాయకులు వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకుండా విధానాలపై మాట్లాడి ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,బి.లక్షమయ్య,సర్దార్ ఖాన్,మీడియా కన్వీనర్ నంది మల్ల. అశోక్,పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి,మాజీ ఎం.పి.పిలు కృష్ణనాయక్,పృథ్వీరాజ్, సంద్యతిరుపతయ్య,Z.P.T.C లు రఘుపతి రెడ్డి,పద్మవెంకటేశ్,మాజీమార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి,జగన్నాథం నాయుడు, మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయికుమార్, వైస్ చైర్మన్ కర్రే స్వామి,మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు,వెంకటస్వామి,వేణు,రాళ్ళ.కృష్ణయ్య,రఘురామరావు,బి.బాలరాజు కౌన్సిలర్స్ బండారు కృష్ణ, నాగన్న యాదవ్, కంచె.రవి,ఎల్లా రెడ్డి,మేకల.ఎల్లయ్య,S.T సెల్ నాయకులు జాతృనాయక్,చంద్రశేఖర్ నాయక్,మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్,మత్స్య సంఘం డైరెక్టర్ పుట్ట.బాలరాజు, నాగేంద్రమ్,నాయకులుఉంగ్లమ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్,సయ్యద్ జమీల్, నందిమల్ల.రమేష్,ఎం.డి గౌస్, సేనాపతి,మైనారిటీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్, వహీద్,యువత అధ్యక్షులు సూర్యవంశపు.గిరి,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి,పెబ్బేరు మండల మైనారిటీ నాయకులు మాజిద్,మండల యువత అధ్యక్షులు చిట్యాల. రాము, వడ్డేమాన్.రవి,నాగరాజు,కార్తీక్, బలీదుపల్లి అంజి,వజ్రాల.రమేష్,మాజీ సర్పంచులు,మాజీ ఎం.పి.టి.సి లు తదితరులు పాల్గొన్నారు. (Story : బలపరుద్దాం..బీఆర్ఎస్ ని కాపాడుకుందాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1