సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /విజయనగరం : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో ప్రముఖ కవి, రచయిత, సామాజిక సంస్కర్త, తెలుగు సాహిత్యానికి అజరామరమైన కీర్తి తెచ్చిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు 162 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లిమర్ల మండలం ఎడ్యుకేషన్ ఆఫీసర్ గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఈ సి మెంబర్ ఈపు విజయ్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మొదటిగా కళాశాల సంచాలకులు డాక్టర్ మజ్జి శశి భూషణ రావు, అతిథులు, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం విధ్యార్థులు గురజాడ గేయాలను ఆలపించి గురజాడవిశిష్టత గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మజ్జిశశి భూషణ రావు మాట్లడుతూ విద్యార్థులు మహనీయులను గూర్చి తెలుసుకొని వారి అడుగు జాడలలో నడవాలని, గురజాడ రచనల లో కన్యాశుల్కం నాటకం అంత్యంత ప్రాచుర్యం పొందిందన్నారు.గురజాడ ఆలోచనలు నేటి సమాజానికి కూడా ఎంతో సముచితం అన్నారు.
కళాశాల హిస్టరీ అధ్యాపకులు గురజాడ మన విజయనగరం లో ఎలా ఉండేవారో సమాజం లో వున్న దురాచారాలు మూడనమ్మకాలు వంటి వాటిపై చేసిన కృషి నీ విద్యార్థులకు వివరించారు.విజయ్ కుమార్ గురజాడ రచనలు సమాజం లో ఎలా ప్రభావితం చేస్తాయో, కన్యాశుల్కం నాటకం మన నిత్య జీవితం లో జరిగే విషయాలకు ఎలా దగ్గరగా వుంటుందో, ఈ నాటకం అప్పటి సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ స్త్రీల హక్కులను గల మెత్తిoదని అని వివరించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ గురజాడ అప్పారావు వంటి మహనీయులను స్మరిస్తూ స్ఫూర్తిని పొంది విలువలతో కూడిన జీవితాన్ని పొందాలని, గురజాడ కేవలం సాహిత్య రంగంలోనే కాకుండా సమాజం లో స్త్రీ హక్కులు, విద్య, మరియు సమానత్వం కోసం చేసిన కృషి ఆచరణీయమైనదన్నారు. అనంతరం విజయ్ కుమార్ ని సత్కరించారు. ఈ కార్యక్రమం లో. సూర్య లక్ష్మి, సుభద్ర, కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం. సత్య వేణి అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గొన్నారు.(Story:సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు)