సీతం కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం కళాశాలలో శనివారం మహాకవి శ్రీ గురజాడ అప్పారావు 162వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. మహారాజా ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు జక్కు రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తన, వ్యక్తిగత ఆలోచన విధానాలను ఆచరణలో పెట్టి ప్రజల మన్ననలను పొందారన్నారు. వీరి కన్యాశుల్కంలో గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఎంతో మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు .కళాశాల డైరెక్టర్ డా. మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ ఇతను అభ్యుదయ కవితా పితామహుడు అనే బిరుదును సంపాదించిన మహోన్నత వ్యక్తిని, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు అని కొనియాడారు.
ప్రిన్సిపాల్ డా. డి. వి. రామమూర్తి మాట్లాడుతూ గురజాడ గారికి కవిశేఖర అనే బిరుదు ఉందని. యువ శక్తి ని పెంపొందించేందుకు గమ్యస్థానంను చేరుకొనే విధానాలు కల్పించడంలోను తమ వంతు కృషి చేసిన మహాకవి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీను నిర్వహించి విజేతలకు గురజాడ రచనలు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కళాశాల చైర్మన్ బొత్స సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ డా. బొత్స ఝాన్సీలక్ష్మి తమ సందేశాలను పంపేరు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి డా. లెంక సత్యవతి, వివిధ విభాగధిపతులు, అధ్యాపకులు, గ్రంథాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story:సీతం కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు)