ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నూతన కార్యా లయం ప్రారంభ
న్యూస్‌తెలుగు/ వినుకొండ :
స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన భవన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే విజయవాడ తదితర వరద బీభత్స ప్రాంతాలలో విద్యుత్ కార్మికులు చేసిన సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కష్టాన్ని చూసి చలించిపోయిన విద్యుత్ కార్మికులు ఎనలేని సేవచేశారన్నారు. అలాగే వరద విపత్తును దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉద్యోగులు ఈనెల 10వ తేదీన 10 కోట్ల 60 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వానికి ఇవ్వడాన్ని కూడా జీవి అభినందించారు. కాగా విధి నిర్వహణలో విద్యుత్ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే జీవీ హామీ ఇచ్చారు. ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 114 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎంవి. గోపాలరావు మాట్లాడుతూ . రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా కేవలం కార్మికులు చే ఎన్నుకోబడిన కార్మిక సంఘం ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో ఒక్క 1104 యూనియన్ మాత్రమేనని వారన్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో జనరల్ ట్రాన్సర్స్ జరుగుతున్నాయని ఈనెల 22వ తేదీ లోపల పూర్తి చేయవలసి ఉన్నది. ఈ తరుణంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వారన్నారు. అధికారులు ప్రభుత్వం పేరు చెప్పి నాయకుల మాటలు విని బదిలీలు చేస్తే యూనియన్ చూస్తూ ఊరుకోదు అన్నారు. బదిలీలు పారదర్శకంగా ఉండాలని, అలా లేనిచో ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని నేతలు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక అధ్యక్షులు ఎస్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కే. శ్రీనివాసులు, డిస్కం అధ్యక్ష కార్యదర్శులు సంజీవరావు శర్మ , గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏడుకొండలు , వరప్రసాద్, జిల్లా నలుమూలల నుండి విద్యుత్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story : ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నూతన భవన కార్యా లయం ప్రారంభ)