సంక్షేమాభివృద్ధి ప్రజలకు అందించడానికే కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు /సాలూరు : సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మండలం, మామిడిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎం శ్యాం ప్రసాద్ అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు.ప్రజల అభీష్టం మేరకే ప్రజల క్షేమం కోసం పనిచేస్తే ప్రభుత్వానికి పంచభూతాలు సహకరిస్తాయని ఆమె అన్నారు. 100 రోజులు పాలనలో చంద్రబాబు గారి విజన్, ఎగ్జిక్యూషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, నాయకత్వ లక్షణాలు ప్రజలకు స్పష్టంగా కనిపించాయని అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం
ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం వారం రోజులు పాటు జరుగుతాయని ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ సొమ్ము రూ.మూడు నుంచి రూ.నాలుగు వేలకు పెంచడం, దివ్యాంగులకు రెండింతలు చేసి రూ.6,000లు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. భూములకు భద్రతలేక, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వంద రోజుల్లోనే 16,437 డిఎస్సి పోస్టుల విడుదల చేయడం జరిగిందని, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామన్నారు. కేవలం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా టిఫిను, భోజనం అందిస్తున్నామని వివరించారు. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ప్రజలకు ఉపయోగపడే పనులనే ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. వరద విపత్తు సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు సహాయక చర్యలు అందించే విధంగా స్వయంగా పర్యవేక్షణ చేసారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ వంద రోజుల కాలంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు. మెగా డి ఎస్ సి విడుదల చేయడం, పింఛన్లను ప్రభుత్వం సమర్ధంగా పంపిణీ చేసిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన చేపట్టిందని అందులో భాగంగా జిల్లాలోనూ జీవనోపాదులు కల్పన, పర్యాటక రంగం అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు జిల్లాలో రక్తహీనత నివారణ, మాతృ శిశు మరణాలు నివారణ ఆవశ్యమని వాటిపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా పొలంబడి పిలుస్తోంది పోస్టర్ను విడుదల చేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించి ఘనంగా కార్యక్రమానికి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు జిల్లా అటవీ శాఖ అధికారి జిఏపి ప్రసూన, మాజీ శాసనసభ్యులు ఆర్పి బంజ్ దేవ్ సర్పంచ్ సువ్వాడ శశికళ తెలుగుదేశం పార్టీ నాయకులు డొంక అన్నపూర్ణ బోస తవుడు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. (Story : సంక్షేమాభివృద్ధి ప్రజలకు అందించడానికే కూటమి ప్రభుత్వం)