UA-35385725-1 UA-35385725-1

పార్కుల్లో స్వచ్ఛత హి సేవ

పార్కుల్లో స్వచ్ఛత హి సేవ

సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌పై ర్యాలీ

న్యూస్‌ తెలుగు/విజయవాడ : స్వచ్ఛత హి సేవ క్యాక్రమంలో భాగంగా నగరంలోని పార్కుల్లో సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర తెలిపారు. స్థానిక రాజీవ్‌గాంధీ పార్క్‌, రివర్‌ ఫ్రంట్‌ ప్లాజాలో స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో భాగంగా కమిషనర్‌ శుక్రవారం శానిటేషన్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 నుండి అక్టోబర్‌ 2 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారన్నారు. రాజీవ్‌గాంధీ పార్క్‌, రివర్‌ ఫ్రంట్‌ ప్లాజా, స్క్రాప్‌ పార్కుల్లో నగర పౌరుల సహకారంతో పార్కులను పరిశుభ్రపరుస్తూ, ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించటం ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. అంతేకాకుండా సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా పాఠశాల, కళాశాల విద్యార్థులు, నగర పౌరులు ర్యాలీలో పాల్గొని ప్రజలకు సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలను వివరించి, వాళ్లకు అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా గాంధీజీ మహిళా కళాశాల, బీసెంట్‌ రోడ్‌, కృష్ణవేణి రోడ్డులో విద్యార్థులు, నగర పౌరులు ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. బీసెంట్‌ రోడ్‌లో జరిగిన సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌ ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని మాట్లాడుతూ విజయవాడను ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దాలని, సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ వల్ల ప్రజలకు కలిగే నష్టాలు గురించి వివరిస్తూ బీసెంట్‌ రోడ్‌ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ వెంకటేశ్వరావు, అడిషనల్‌ కమీషనర్‌ కేవీ.సత్యవతి, సీఎంఓహెచ్‌ డా.పీ.రత్నవాళి, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇనస్పెక్టర్లు, సెక్రటరిలు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : పార్కుల్లో స్వచ్ఛత హి సేవ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1