Home వార్తలు తెలంగాణ క్రమశిక్షణ పట్టుదలతో నే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు

క్రమశిక్షణ పట్టుదలతో నే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు

0

క్రమశిక్షణ పట్టుదలతో నే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు

న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యార్థులు, క్రమశిక్షణ పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. రవికుమార్ అన్నారు. గురువారం వనపర్తి లోని తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాలలో లోక్ అదాలత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది .ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతో పాటు దేశభక్తి, సేవ భావము అలవర్చుకోవాలని సూచించారు. వివేకానందుని లాంటి గొప్ప వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసర విద్యార్థులు యువతులపై ఉందన్నారు. సమాజ హితమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. చిన్నప్రాయంలోనే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయం వాదులు మహిళా చట్టాలు, సైబర్ నేరాలు, వినియోగదారుల చట్టం తదితర చట్టాలను వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య, శ్రీదేవి ,సఖి కేంద్రం లీగల్ కౌన్సిల్, న్యాయవాద సంఘం వైస్ ప్రెసిడెంట్ డి. కృష్ణయ్య ,న్యాయవాది నరేందర్ బాబు, కళాశాల ప్రధానాచార్యులు హవిలా రాణి, తెలంగాణ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీధర్, అధ్యాపకులు విద్యార్థులు లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : క్రమశిక్షణ పట్టుదలతో నే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version