Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు

సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు

0

సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు

సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల రాష్ట్రస్థాయిలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు అధికం కావడం, పదుల సంఖ్యలో బాధితులు తమ సొమ్మును కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ముంబై పోలీసులమంటూ ఓ వ్యక్తిని బెదిరించి అతని నుంచి 33 లక్షల కాజేసిన సైబర్ నేరగాలని సత్యసాయి జిల్లా పోలీసులు పథకంతో పట్టుకున్నారు. ఈ వివరాలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పి రత్న పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణానికి చెందిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఈనెల 18వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీస్ లోగో ఉన్న ఫోన్ నెంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ చేసి మేము పోలీసులము మాట్లాడుతున్నామని తెలియజేసి నీపై భావద్ద కేసు రిజిస్టర్ అయిందని నరేష్ గోయల్ అనే వ్యక్తి 500 కోట్ల రూపాయలు కెనరా బ్యాంకులో అప్పుగా తీసుకొని ఆ డబ్బులను నరేష్ గోయాల్ తన సంస్థకు వాడకుండా ప్రజల వద్ద నుండి డబ్బులు తీసుకొని ఎకౌంట్లో వేసిన డబ్బులకు కమిషన్ రూపంలో ఫిర్యాదుకు 20 లక్షల రూపాయలు వచ్చినట్లు, అతని యొక్క ఫేక్ డెబిట్ కార్డ్ ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్లను చూపించి డాక్టరను నమ్మించడం జరిగిందన్నారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే మీరు 33 లక్షల రూపాయలు మేము చెప్పిన అకౌంట్లకు వేయాలని వేయకపోతే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మీ ప్రాంతానికి వచ్చి అరెస్టు చేసి ముంబైకి తీసుకొని వెళ్తామని బెదిరించడం జరిగింది అని తెలిపారు. ఇంతలో డాక్టర్ వీరి మాటలకు భయపడి ఈనెల 20వ తేదీ నా ఎస్బిఐ బ్యాంక్ నుండి 20 లక్షల రూపాయలను ఆర్టిజిఎస్ ద్వారా వారు చెప్పిన బ్యాంకు ఖాతా అయిన మంగ మరదలా ఎంటర్ప్రైజెస్ కు చెల్లించడం జరిగింది అన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఐడిఐబి బ్యాంకు నుండి 13 లక్షలు కూడా మంగా మద్దల ఎంటర్ప్రైజెస్ కు డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. డాక్టరు డబ్బులు చెల్లించిన తర్వాత సదరు విషయాన్ని విచారించుకోగా ఫిర్యాదుకు ఫోన్ కాల్ చేసినవారు ఫేక్ అని తేలడంతో తాను మోసపోవడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని ఈనెల 22వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ వారికి తెలుపగా ఎన్సీఆర్పి పోర్టల్ నందు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల వివరాలు తెలుపుతూ ఇలియాజార్ పొద్దుటూరు కడప జిల్లా, ఎం ప్రహల్లాద అయ్యలూరు మిట్ట నంద్యాల జిల్లా, స్వామి దాసు, కడప జిల్లా పొట్లంపల్లి, అల్లు అమ్మిరెడ్డి వెంకటాచలం కాలనీ నంద్యాల జిల్లా, బి సత్యం ఆళ్లగడ్డ మండలం కర్నూలు జిల్లా, జావీద్ గూడుపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అని తెలిపారు. వీరందరినీ సైబర్ క్రైమ్ టీమ్ కు ఈ కేసును అప్పగించడం జరిగిందని తెలిపారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ తిమ్మారెడ్డి తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానంతో ఆరుగురు సైబర్ నేరగాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు తెలిపారు. ఈ కేసును చేదించిన తిమ్మారెడ్డి, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కిరణ్ కుమార్, బీసీలు మల్లికార్జునరావు ధర్మవరం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ చలమారెడ్డి శివశంకర్ అబ్దుల్లా దివాకర్ రాజు తదితర సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించి, అవార్డు రివార్డులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎస్పి శ్రీనివాసులు, స్థానిక డిఎస్పి శ్రీనివాసులు పాల్గొన్నారు. (Story : సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version