Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

0

నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

కమిషనర్ నల్లనయ్య

న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి జరుగుతున్న అభివృద్ధి పనుల తనిఖీలను చేపట్టారు. విజయనగరంలోని కే.ఎల్.పురం, ఆర్టీసీ కాలనీ, ఉడా కాలనీ, అలకానంద కాలనీలలో రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. అలకనంద కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని పరిశీలించారు. అయితే అక్కడ ఉన్న పార్క్ లోపల గుబురుగా పెరిగిన మొక్కలను తక్షణమే తొలగించాలని, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల సమాచారాన్ని సమగ్రంగా అందించలేని ఎమ్యునిటీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా నిర్మాణ పనుల జరుగుతున్న సమయంలో అక్కడే ఉండాలని, నాణ్యతలో రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. (Story : నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version