క్రమశిక్షణతో కూడిన విద్య ఉజ్వల భవిష్యత్తునిస్తుంది
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మంచి క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తుందని ప్రభుత్వ బాలుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశాన్ని వారు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థుల చదువు, తీరు తెన్నలు, ప్రవర్తన నియమావళి గురించి మాట్లాడడం జరిగిందని తెలిపారు. చదువులో పట్టుదల శ్రద్ధ వహిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, తల్లికి వందనం ఉచితంగా అందిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క హాజరు శాతమును, మార్కులు తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. తదుపరి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల పట్ల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు చూపుతున్న చోరువ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : క్రమశిక్షణతో కూడిన విద్య ఉజ్వల భవిష్యత్తునిస్తుంది)