Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ వరద బాధితులకు పరిటాల ట్రస్ట్ సాయం

విజయవాడ వరద బాధితులకు పరిటాల ట్రస్ట్ సాయం

0

విజయవాడ వరద బాధితులకు పరిటాల ట్రస్ట్ సాయం

సీఎం చంద్రబాబుకు రూ.5లక్షల చెక్ అందజేసిన పరిటాల శ్రీరామ్

ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా.. పరిటాల ట్రస్ట్ సాయం అందిస్తుందన్న శ్రీరామ్

ఇప్పటికే ప్రత్యక్షంగా బాధితులకు బాసటగా నిలిచిన పరిటాల సునీత

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విజయవాడలో వరద బాధితులకు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ సాయం ప్రకటించింది. ఇటీవల విజయవాడ ప్రాంతంలో కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చి.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఈ నేపథ్యంలో బాధితులకు తమ వంతు సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత ముందుకొచ్చారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు.. ఇప్పుడు విజయవాడ వరద బాధితుల కోసం 5లక్షల రూపాయలు ప్రటించింది. పరిటాల శ్రీరామ్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదని.. వారు నష్టపోయింది చూస్తే.. మనం ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు. అందుకే మా వంతు ఈ సాయం చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి.. బాధితులకు బాసటగా నిలిచారు. నిత్యవసరాల పంపిణీ చేయడమే కాకుండా.. కాలనీలు శుభ్రం చేసే కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కష్ట, నష్టాలు తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపారు. ఈ సందర్బంగా పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు నారా లోకేష్ బాబును గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిటాల సునీతకు, పరిటాల శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : విజయవాడ వరద బాధితులకు పరిటాల ట్రస్ట్ సాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version