Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నైట్ అవుట్ అల‌వెన్స్‌ల‌పై జాప్య‌మేల‌?

నైట్ అవుట్ అల‌వెన్స్‌ల‌పై జాప్య‌మేల‌?

నైట్ అవుట్ అల‌వెన్స్‌ల‌పై జాప్య‌మేల‌?

ఆర్టీసి విలీనం అనంతరం నిలుపుదల చేసిన ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతలకు ప్రభుత్వం అనుమతిఇవ్వాలి..
వరద బాదితుల సహాయార్దం ఒక్కరోజు ఆర్టీసి ఉద్యోగుల వేతనం లో బేసిక్ పేని సియం సహానిధికి ప్రకటించాం..
ఆర్టీసి ఉద్యోగుల ఉద్యోగ భద్రతకోసం టిడిపి హయాంలో ఇచ్చిన సర్క్యులర్ నెంః 01/2019 ని గత ప్రభుత్వం రద్దుచేసింది.దానిని పునరుద్దరించాలి..
ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు

న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం గత ప్రభుత్వం హయాంలో జరిగిన 11వ పిఆర్శీ అమల్లో బాగంగా జీవో 114 ప్రకారం ఏపీ పిటిడి( ఆర్టీసీ) లో పని చేస్తున్న డ్రైవర్/ కండక్టర్లకు మరియు హెడ్ క్వార్టర్స్ విడిచి బయట ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆర్టీసి ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ట్రావెలింగ్ అలవేన్స్ & డైలీ అలవేన్స్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నైట్ హాల్టు సర్వీసులన్నింటికీ వేతన బిల్లు తో పాటు చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం హాయాంలో నిలుపుదల చేసిన ఈ నైట్ హాల్టు అలవెన్సులను 2022 పెండింగు ఉన్నవాటిని అరియర్సుతో పాటు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ(ఆర్టీసి) ఎంప్లాయిస్ యూనియన్(ఇ.యు) రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపిజేఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేసారు. బుదవారం వినుకొండ డిపో ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ డిపోకమిటి ఆద్వర్యంలో బృందావనం ఫంక్షన్ హాల్ లో డిపో అధ్యక్షులు దాసరి విన్సెంట్ అధ్యక్షతన,డిపో కార్యదర్శి పి. సాంబశివరావు (సాంబు) ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో పలిశెట్టి దామోదరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు………….. ఈ సందర్భంగా వినుకొండ డిపోలో ఉన్న వైయస్ఆర్ ఆర్టీసి ఎంప్లాయీస్ అసోషియేషన్ ను పూర్తిగా రద్దుచేసూకొని ఆ అసోషియేషన్ కు చెందిన ఎన్ ఎం యు ఏ నుండి కలిపి 40 మంది ఆర్టీసి ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్లో దామోదరరావు సమక్షంలో చేరారు. ఈసందర్బంగా ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఏడు దశాభ్దాలు నిరంతరం ఆర్టీసి ఉద్యోగుల సంక్షేమంకోసం, హక్కుల సాదనకోసం,ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేసే చరిత్ర గల యూనియన్ అని ఇలాంటి సంఘం లో వై.యస్.ఆర్ ఎంప్లాయీస్ అసోషియేషన్ సభ్యులందరు చేరడం అభినందనీయం అని ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతంగా ఉంటే ఆర్టీసి ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించు కొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు చెల్లింపులు పై, ట్రెజరీ ఉన్నతాధికారులను, ఆర్టీసీ ఎండీ దఫ, దపాలుగా వినతి పత్రాలు అందచేయడమైనది. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన నైట్ అవుట్ అలవేన్సులు చెల్లింపులపైన,గతంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చిన ఉద్యోగబద్రతపై ఇచ్చిన సర్క్యులర్ నెంః 01/2019 ను గత ప్రభుత్వ హాయాంలో రద్దుచేసినందున దానిని అమలు చేయాలని ఇప్పటికే గౌరవ రవాణా మంత్రి రాంప్రసాధ్ రెడ్డి కలసి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈనైట్ హాల్టు అలవెన్సులు చెల్లింపులు జాప్యంలో ఆర్టీసిలో పనిచేస్తున్న ట్రాఫిక్ & గ్యారేజ్ కు చెందిన మరియు తనికీఅధికార్లు సుమారు 30 వేల మందివరకు ఇబ్బందులు పడుతు ఆర్దికంగా నష్టపోతున్నందున వెంటనే ప్రభుత్వంచర్యలు తీసుకుని చెల్లింపులు జరిగేలా చూడాలని దామోదర్ రావు విజ్ఞప్తి చేశారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసిన నాటినుండి ఆర్టీసి ఉద్యోగులకు రావల్సిన పదోన్నతలు పెండింగులో పడ్డాయని, పదోన్నతలు సమస్యను పరిష్కరింప జేసేందుకు ఇప్పటికే ఆర్టిసి మేనేజింగు డైరెక్టర్ ద్వారకాతిరుమలరావు ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిన్ బ్రహ్మనందరెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లామని ఈపదోన్నతలు సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే సుమారు 3000 మంది కి పదోన్నతలు లభిస్తాయని దామోదరరావు తెలిపారు. ఈసమావేశంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిధి ఇ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపాటి శంకరరావు మాట్లాడుతూ పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు ప్రస్తుతం విలీనం అనంతం ఇస్తున్న ఇ.హెచ్.యస్ ద్వారా సరైన వైద్యసౌకర్యాలుఅందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నందున ఆర్టీసి విలీనం కాక ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నవిదంగా ఆర్టీసి ఉద్యోగులకు రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్యసౌకర్యాలు అందించేలా చూడాలని,అలాగే రిటైర్ అవుతున్న ఆర్టీసి ఉద్యోగులకు గతంలో మాదిరిగా రిటైర్డు ఎంప్లాయీస్ మెడికిల్ స్కీమ్ (ఆర్.ఇ.యం.యస్) ను పునరుద్దరించాలని శంకరరావు విజ్ఞప్తి చేసారు. ఈసమావేశంలో ఇ.యు రాష్ట్రఉపాద్యక్షులు యం.కోటేశ్వరరావు, రాష్ట్రఆర్గనైజింగు సెక్రటరీ బి.కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు యస్.కె.ఖాజా, జిల్లా కార్యదర్శి జి.టి.రావు, జోనల్ కమిటి సభ్యులు హరిబాబు, కె.వి.అనూరాధా స్టేట్ మెంటునెన్సుకమిటి మెంబర్ వి. శ్రీనివాసరావు తో పాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. (Story : నైట్ అవుట్ అల‌వెన్స్‌ల‌పై జాప్య‌మేల‌?)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!