Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గరుడ సేవ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష

గరుడ సేవ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష

గరుడ సేవ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష

న్యూస్‌తెలుగు/ తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉన్నందున, అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో బుధవారం సాయంత్రం అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు.

ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని చెప్పారు.

అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో టీటీడీ సిఇ సత్యనారాయణ, తిరుమలలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (Story : గరుడ సేవ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!