Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరదబాధితులకు వైస్సార్సీపీ ఆపన్నహస్తం

వరదబాధితులకు వైస్సార్సీపీ ఆపన్నహస్తం

0

వరదబాధితులకు వైస్సార్సీపీ ఆపన్నహస్తం

వరద బాధితుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైయ స్.జగన్  రూ.1 కోటితో సహాయక చర్యలు

ఒక నెల జీతాన్ని వితరణగా అందించిన వైయస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

ఇప్పటికే రెండు దశలలో సాయం అందించిన వైయస్సార్సీపీ

రేపటి నుంచి మూడో దశ వరద సాయం 

రేషన్ సరుకులతో కూడిన 50 వేల స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ

పార్టీ సహాయకచర్యల్లో భాగంగా ఇప్పటికే  లక్ష పాలప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ

రెండోదశలో 75వేల పాలప్యాకెట్లు, 1 లక్ష వాటర్ బాటిళ్లు 

రేపటి నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ

పంపిణీ చేయనున్నస్పెషల్ కిట్లను పరిశీలించిన వైయస్సార్సీపీ నేతలు

న్యూస్‌తెలుగు/తాడేపల్లి : మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో రేపటి నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. వరద ప్రాంతాల బాధితులో కోసం శ్రీ వైయస్.జగన్ ప్రకటించిన రూ.1 కోటి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతలగా పార్టీ కేడర్ సాయం అందించింది. తొలివిడతలో 1 లక్ష పాలప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు, రెండోదశలో 75వేల పాలప్యాకెట్లు, 1 లక్ష వాటర్ బాటిళ్లు పార్టీ తరపున పంపిణీ చేశారు.

మూడో దశలో భాగంగా రేపటి నుంచి సరుకులతో కూడిన 50 వేల స్పెషల్ ప్యాకెట్లు వరద ప్రాంతాల్లో అందించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ప్యాకెట్లో బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించనున్నారు. రేపు 30 వేల ప్యాకెట్లను, ఎల్లుండి మరో 20 వేల ప్యాకెట్లను వరద బాధితులకు అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇవాళ విజయవాడ హనుమాన్‌ పేటలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జి ఆసిఫ్ ఇతర నేతలు పరిశీలించారు. మరోవైపు వైయస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని వితరణగా అందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version