కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “స్వచ్ఛతాహి సేవ” కార్యక్రమం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : స్థానిక పట్టణంలోని కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా॥ బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ , విద్యార్థులు వాలంటీర్లు నడుమ ” స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ప్రారంభం చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం, క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ అధ్వర్యంలో సెప్టెంబర్ 17-అక్టోబర్ 2 వరకు కార్యక్రమలు తలపెట్టడం జరిగింది అని,అందులో భాగంగా పాదులుచేసి మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కలశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి వ్యక్తి తమ మాతృమూర్తి పేరుతో తలా ఒక్క మొక్కను నాటాలని విద్యార్థులని ఉద్దేశించి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డా. త్రివేణి, డా. ఎస్. షమీవుల్లా, డాక్టర్ బి. గోపాల్ నాయక్, ఎ. కిరణ్ కుమార్, యం భూవనేశ్వరి, పుష్పవతి, బి. ఆనంద్, వి.హైమవతి, మీనా, ధనుంజయ మరియు తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “స్వచ్ఛతాహి సేవ” కార్యక్రమం)