యమహా స్పోర్ట్స్ బైక్ విడుదల
చెన్నై: స్పోర్ట్స్ బైకుల విభాగంలో పోటీని మరింత పెంచే ఉద్దేశంలో భాగంగా యమహా మోటార్ సరికొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్బస్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్‌తో రూపొందించిన ఆర్15ఎం బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 155 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైక్ ధర రూ.2,08,300గా నిర్ణయించింది. ఈ ధరలు దిల్లీ షోరూమ్‌నకు సంబంధించినవి. అలాగే దీంతో పాటు ఆర్15 ఎం.మెటాలిక్ గ్రే కలర్ మోడల్ ధర రూ.1,98,300. (Story : యమహా స్పోర్ట్స్ బైక్ విడుదల)